అందుకే అక్కడ శిబిరం పెట్టాం: అశోక్‌బాబు

గుంటూరు: వైసీపీ బాధితుల శిబిరానికి అదనపు ఎస్పీ రావటం ఆహ్వానించ దగ్గ పరిణామం అని ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. సమస్య పరిష్కారానికి టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. గుంటూరులో తీవ్రత ఉంది కాబట్టి ఇక్కడ శిబిరం పెట్టామని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా వరకు తాము బాధ్యత తీసుకుంటామని అదనపు ఎస్పీ చెప్పారని, నిజంగా సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని అనుకుంటే ఓ ఉన్నతాధికారిని పంపాలని, తమ డిమాండ్లు ఉన్నతాధికారి ముందు పెట్టి పరీష్కారానికి సహకరిస్తామన్నారు. బాధితుల్ని హోంమంత్రి పెయిడ్ ఆర్టిస్టులు అని అవమానించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అశోక్‌బాబు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *