అద్భుతమైన పార్లమెంటేరియన్‌ను కోల్పోయాం – మహారాష్ట్ర గవర్నర్‌

ముంబయి: కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్‌ నేత సుష్మాస్వరాజ్‌ హఠాన్మరణం పట్ల మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రాజకీయ చరిత్రలో సుష్మ తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి పనిచేసిన క్షణాలను గుర్తుచేసుకున్నారు.

‘స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలోని ప్రముఖ మహిళా నాయకురాళ్లలో సుష్మాస్వరాజ్‌ ఒకరు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు, బాధ్యతలు చేపట్టిన సుష్మ.. అన్నింటిలోనూ తనదైన ముద్ర వేశారు. మాజీ ప్రధాని అటల్‌ బిహరీ వాజ్‌పేయీ ప్రభుత్వంలో ఆమెతో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. క్లిష్ట రాజకీయ పరిస్థితుల్లో సుష్మ నాకు అండగా నిలిచారు. ఆమె బలమైన నాయకురాలు. ఎంతో గొప్పగా మాట్లాడటం ఆమెకు దేవుడిచ్చిన వరం. తెలంగాణలో ఆమె ఎన్నో ప్రసంగాలు చేశారు. ఆ ప్రసంగాలను నేను అనువాదం చేయడం గర్వంగా భావిస్తున్నా. నేడు భరతజాతి ఓ అద్భుతమైన పార్లమెంటేరియన్‌ను, ఛరిష్మా ఉన్న నాయకురాలిని కోల్పోయింది’ అని విద్యాసాగర్‌ రావు సంతాపం తెలియజేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *