అభిమానికి రోహిత్‌ సర్‌ప్రైజ్‌

బర్మింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం టీమిండియా-బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆరంభం నుంచి బౌండరీల మోత మోగించిన ఓపెనర్ రోహిత్‌ శర్మ ఓ అభిమానిని సర్‌ప్రైజ్‌ చేశాడు. నిన్నటి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఐదు అద్భుతమైన సిక్సర్‌లు బాదిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్‌ కొట్టిన ఓ సిక్సర్‌ బంతి ఓ మహిళా అభిమానికి తగిలింది. 104 పరుగులు చేసి పెవిలియన్‌ చేరిన రోహిత్‌.. మైదానం నుంచి వెళ్లేటప్పుడు ఆగి అక్కడున్న అభిమానులను అడిగాడు. తన బంతి ఎవరికి తగిలిందో చెప్పాల్సిందిగా వారిని కోరాడు. మ్యాచ్‌ పూర్తయిన అనంతరం ఆమెను పిలిపించి, మాట్లాడి ఆమె హ్యాట్‌పై సంతకం చేసి ఇచ్చాడు. ఆమెతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు. ఈ ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌లో పంచుకుంది. దీంతో ఇవి వైరల్‌ అవుతున్నాయి. రోహిత్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు రోహిత్‌ నాలుగు శతకాలు చేశాడు. నిన్న జరిగిన మ్యాచ్‌లో శతకం చేయడంతో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మొదట భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగులు చేయగా.. ఛేదనలో బంగ్లా 48 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *