ఆగలేరా?.. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా?: కేటీఆర్

హైదరాబాద్‌ సిటీ: ‘సిగ్నళ్లు ఉన్న చౌరస్తాల్లో జీబ్రా లైన్ల వద్ద ఆగితే తప్పేంటి..? ఆగకపోతే పెనాల్టీ వేస్తే తప్పేంటి..? అసలు ఫుట్‌పాత్‌ మీద బండ్లు ఎందుకు నడపాలి..? రోడ్డు బాగుందా..? బాగాలేదా..? అన్న చర్చ ఒక్క నిమిషం పక్కన పెట్టండి. జీబ్రా లైన్‌ల వద్ద ఆగడానికి ఇబ్బందేంటి..?’ అని పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. జీబ్రా లైన్‌ల వద్ద మనుషులు రోడ్డు క్రాస్‌ చేయకూడదా..? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా నడిపే వాళ్లకు ఫైన్లు వేస్తే కామెంట్లు అంటే ఎట్లా..? నన్నడిగితే అలాంటి వారికి చలానాలు వేస్తే తప్పు లేదని పేర్కొన్నారు. నగరంలో డెంగీ, వైరల్‌ ఫీవర్లు విజృంభిస్తోన్న నేపథ్యంలో.. సోమవారం ఆయన జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ చలానాలు విధిస్తామంటున్నారు.. రోడ్లపై గుంతలు, పొంగిపొర్లే మురుగు… వంటి వాటికి ప్రభుత్వానికీ వేలు, లక్షల్లో జరిమానా వేయాలంటు సోషల్‌ మీడియాలో సందేశాలు వైరల్‌ అవుతున్నాయి.. మీ అభిప్రాయం ఏంటన్న విలేకరుల ప్రశ్నకు కేటీఆర్‌ పైవిధంగా స్పందించారు. మన దగ్గర ఇంకా చలానాలు వసూలు చేస్తున్నట్టు లేరు. దేశం బాగుపడాలంటే పౌరుల్లో క్రమశిక్షణ రావాలి. అదెప్పుడొస్తది.. ఎట్లొస్తది.. ఎక్కడ మొదలు పెడ్తామన్నది పక్కన పెడితే… ఎక్కడో ఒక చోట ప్రారంభం కావాల్సిందే. అందులో అనుమానం లేదు’ అన్నారు. దాని గురించి కామెంటరీ చెప్పొచ్చు.. ఇది బాగాలేదు.. అది బాగా లేదు.. అనొచ్చు. నేనొకటి అడుగుతా ఉన్నా. సిగ్నళ్లు ఉన్న చోట జీబ్రా లైన్‌ వద్ద ఆగితే తప్పేంటి..? ఆగకపోతే పెనాల్టీ వేస్తే తప్పేంటి.? ఉల్లంఘనులెవ రైనా.. సివిల్‌ డిసిప్లిన్‌, సివిక్‌ సెన్స్‌ లేని వారికి ఫైన్‌లు వేస్తే ఏ తప్పు లేదు. దాన్నెవరైనా తప్పు పడితే వాళ్లది తప్పు అని కేటీఆర్‌ పేర్కొన్నారు. గవర్నర్‌గా తమిళసై సౌందరరాజన్‌ నియామకంపై కామెంట్‌ చేయనని కేటీఆర్‌ పేర్కొన్నారు. అది రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని, నేనేలా మాట్లాడతానని.. కొత్త గవర్నర్‌ నియామకం రాజకీయపరమైన అడుగుగా భావిస్తున్నారా..? అన్న ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. గవర్నర్‌గా ప్రభుత్వం తరపున ఆమెకు స్వాగతం పలికాం.. రెండో మంత్రిగా నాతో ప్రమాణ స్వీకారం చేయించారన్నారు. గత గవర్నర్లలానే డిగ్నిటీ కాపాడుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. నా కారుకూ జరిమానా వేశారుట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధించడం సబబే. వేగంగా వెళ్తున్న కారణంగా నా పేరుతో ఉన్న కారుకూ జరిమానా వేశారు. అవినీతి పెరగడానికి భారీ జరిమానాలు దారితీస్తాయన్న ఆందోళన అర్థరహితం. అవినీతి పెరుగుతుందని ఎలా అనుకుంటారు? అదెలా సాధ్యం? మేం ప్రతి చోటా కెమెరాలు ఏర్పాటు చేశాం. ట్రాఫిక్‌ పోలీసులు అడిగినప్పుడు ఎలక్ర్టానిక్‌ రికార్డులు చూపిస్తే చాలు. ఇవి ఒరిజనల్‌ డాక్యుమెంట్లతో సమానం.– కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *