ఆదర్శ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు: లోకేశ్

అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరిల పెళ్లిరోజు నేడు. ఈ సందర్భంగా వారి తనయుడు నారా లోకేశ్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ‘‘ఈ రోజు అమ్మానాన్నల పెళ్ళిరోజు. సహధర్మచారిణి అన్న పదాన్ని నాన్నగారి జీవితంలో నిజం చేస్తూ ఆయన ఆశయాల్లో, ఆలోచనల్లో తోడుగా నిలుస్తానంటూ చేయిపట్టి అమ్మ ఏడడుగులు నడిచిన రోజు. ఆ ఆదర్శ దంపతులు సుఖసంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ పెళ్లిరోజు శుభాకాంక్షలు.’’ అని లోకేశ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *