ఆ సైట్లను బ్లాక్‌ చేయండి: దిల్లీ హైకోర్టు

దిల్లీ: తమిళ్‌ రాకర్స్‌, ఈజెడ్‌ టీవీ, కట్‌మూవీస్‌, లైమ్‌ టొరెంట్స్‌ వంటి సైట్లను తాత్కాలికంగా బ్లాక్‌ చేయమని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను(ఐ.ఎస్‌.పి) దిల్లీ హైకోర్టు ఆదేశించింది. అమెరికాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌‌.. తమ నిర్మాణ సంస్థ నుంచి వెలువడిన చిత్రాలను, వెబ్‌ సిరీస్‌లను అనధికారికంగా తమిళ్‌ రాకర్స్‌ వంటి ప్రైవేటు వెబ్‌సైట్స్‌ వీక్షకులకు ఉచితంగా అందిస్తున్నాయి అని హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. 

పిటిషన్‌ను స్వీకరించి వాదనలు విన్న  హైకోర్టు న్యాయమూర్తి సంజీవ్‌ నారులా.. అటువంటి వైబ్‌సైట్లకు నెటిజన్స్‌ ప్రవేశించకుండా వాటి యూఆర్‌ఎల్స్‌(యూనిఫాం రిసోర్స్‌ లెకేటర్స్‌), ఐపీ అడ్రెస్‌లను బ్లాక్‌ చేయవలసిందిగా ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను(ఐ.ఎస్‌.పి) కోరారు. అలానే నిర్మాణ సంస్థలకు చెందిన కాపీరైట్లను ఉల్లంఘించినందుకు ఆ వెబ్‌సైట్లపై నమోదు చేసిన డొమైన్‌ పేర్లను తొలగించి తగిన చర్యలు తీసుకోవాలని సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖకు మార్గనిర్దేశం చేశారు.

నెట్‌ఫ్లిక్స్‌, యూనివర్సల్‌, పారామౌంట్‌, స్టార్‌కి చెందిన కాపీరైట్‌ కంటెంట్లను అనధికారికంగా వాడుతున్న వెబ్‌సైట్స్‌పై నిఘాపెట్టి వాటిని తొలగించే విధంగా ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు(ఐ.ఎస్‌.పి) తగిన నోటిఫికేషన్‌ జారీ చేయాల్సిందిగా డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ టెలీకమ్యూనికేషన్స్‌(డాట్‌)ను హైకోర్టు సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *