ఇంత అమానుషం ఎక్కడా చూడలేదు: చంద్రబాబు

అమరావతి: కళ్యాణదుర్గంలో వైసీపీ నేతల అరాచకాలపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై మంగళవారం పార్టీ అధినేత చంద్రబాబును నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు కలిసి ఫిర్యాదు చేశారు. పరిస్థితిని తెలుసుకున్న చంద్రబాబు.. వైసీపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తల తోటలను నరికేయడం అమానుషం అని ధ్వజమెత్తారు. వైసీపీ నేతల ఆగడాలకు అంతం లేకుండా పోయిందన్నారు. టీడీపీ కార్యకర్తల ఆర్థిక మూలాలు దెబ్బ తీయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇంత అమానుషాలను దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. వైసీపీ విధ్వంసకాండకు లెక్కలేకుండా పోయిందన్నారు. నిస్సహాయ పోలీసింగ్ వైసీపీ అరాచకాలకు తోడైందని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఈ అరాచకాలకు వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అన్ని జిల్లాలలో బాధితులు అందరికీ న్యాయం చేయాలన్నారు. బాధితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *