ఇక వెతకడం ఎంతో ఈజీ!

వాట్సాప్‌ చాట్‌లో లెక్కలేనెన్ని ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు ఉండవచ్చు. కావాల్సిన వాటిని వెతుక్కోవడానికి బోల్డంత సమయం వృథా అవుతుంది. త్వరలో ఈ ప్రయాస తప్పే ఛాన్స్‌ ఉంది. సాధారణంగా ఎవరి చాట్‌ అయితే చూస్తున్నామో…. అందులో ఉన్న ఫోటోలు చూడటానికి మీడియా అనే ఆప్షన్‌ ఉండనే ఉంది. ఇప్పటికే డాక్యుమెంటట్స్‌, లింక్స్‌ పేరుతో వేర్వేరుగా ఆప్షన్లు ఉన్నాయి. అయితే త్వరలోనే అడ్వాన్స్‌డ్‌ సెర్చ్‌ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతోంది వాట్సాప్‌. ఫోటోస్‌, జిఫ్స్‌, లింక్స్‌, వీడియోస్‌ల పేరుతో వేర్వేరుగా ఆప్షన్లు ఉంటాయి. మీకు కావాల్సిన వాటిని క్లిక్‌ చేస్తే చాలు. అన్నీ ప్రత్యక్షమవుతాయి. త్వరలోనే వాట్సాప్‌ ఐఓఎస్‌ వెర్షన్‌లో ఈ అప్‌డేట్‌ రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *