ఏపీ వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల తాత్కాలిక మూత

అమరావతి: గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన అన్నక్యాంటీన్లు ఏపీ వ్యాప్తంగా తాత్కాలికంగా మూతపడ్డాయి. పలు జిల్లాల్లో క్యాంటీన్లకు నిర్వాహకులు తాళాలు వేసేశారు. రోజులాగే అహారం కోసం వచ్చిన ప్రజలు గురువారం సైతం వెనుదిరుగుతున్నారు. గత కొన్ని రోజులుగా వివిధ జిల్లాల్లోని అన్నక్యాంటీన్లకు తెలుపు రంగు వేస్తున్నారు. మరోవైపు కొద్దిరోజుల పాటు సేవలు ఆపాలని అక్షయపాత్ర ఫౌండేషన్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త్వరలో పేరుమార్పుతో అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం అన్న క్యాంటీన్లు ఉన్న ప్రదేశాలను కూడా ప్రభుత్వం మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అక్షయపాత్ర ఫౌండేషన్‌కు ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. అయితే, అన్న క్యాంటీన్లను పూర్తిగా మూసేసే యోచనేదీ లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *