ఐరాస నుండి తమ వివాదాస్పద రాయబారిని తొలిగించిన పాకిస్తాన్

అనేక వివాదాలకు కారణమైన మలీహా లోధి ని ఎట్టకేలకు పాకిస్తాన్ ఆ పదవినుండి తొలిగించింది . ఆమె స్థానంలో మునీర్ అక్రమ్ ను పాకిస్తాన్ రాయబారిగా నియమించారు, పాకిస్తాన్ విదేశాంగ శాఖ సోమవారం ఈ విషయాన్ని ప్రకటించింది. ఐరాసలో పాకిస్తాన్ రాయబారి మునీర్ అక్రమ్ ఉంటారు. మునీర్ అక్రమ్ గతంలో 2002 మరియు 2008 మధ్య ఈ పదవిలో ఉన్నారు. అక్రమ్ కాకుండా అనేక కొత్త నియామకాలను కూడా ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఖలీల్ అహ్మద్ హష్మిని ఐక్యరాజ్యసమితికి పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధిగా నియమించారు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ కొత్తగా ముగ్గురు రాయబారులను నియమించింది. మొహమ్మద్ ఎజాజ్‌ను హంగరీ రాయబారిగా నియమించారు. సయ్యద్ సజ్జాద్ హైదర్‌ను కువైట్ రాయబారిగా నియమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *