ఒడుదొడుకులతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్లు శుక్రవారం ఒడుదొడుకులతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలతో ఈ ఉదయం లాభాలతో ఆరంభమైన సూచీలు.. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. నేడు వెలువడే ఇన్ఫోసిస్‌ త్రైమాసిక ఫలితాలపై దృష్టిపెట్టిన మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఫలితంగా సూచీలకు ఊగిసలాట తప్పట్లేదు. ఉదయం 9.45 గంటల సమయానికి సెన్సెక్స్‌ 29 పాయింట్ల నష్టంతో 38,793 వద్ద, నిఫ్టీ 11 పాయింట్లు నష్టపోయి 11,572 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 68.49గా కొనసాగుతోంది. విప్రో, ఆటోమొబైల్‌ రంగాల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *