కల్వకుంట్ల చరిత్ర రాస్తున్నారు: లక్ష్మణ్

న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ పోరాటాల చరిత్రను మరుగునపడేలా కల్వకుంట్ల చరిత్ర రాస్తున్నారని వ్యాఖ్యానించారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. మజ్లీస్ ప్రోద్భలంతో తెలంగాణ పోరాటాల చరిత్రను కాలగర్భంలో కలిపేశారని విమర్శించారు. తెలంగాణ విమోచన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. విమోచనదినాన్ని అధికారికంగా జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని లక్ష్మణ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *