కృష్ణా వరదలో చిక్కుకున్న కాపర్లు, 400 గొర్రెలు!

చందర్లపాడు: కృష్ణమ్మ వరదలో 400 గొర్రెలు, నలుగురు కాపరులు చిక్కుకున్నారు. ఎగువ నుంచి వచ్చిన వరదతో కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం మునుగోడు లంక జలదిగ్బంధమైంది. గొర్రెలను మేపేందుకు వెళ్లిన కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన కాపరులు వరద నీరు ముంచెత్తడంతో సంగళ్లపాలెం సమీపంలోని కృష్ణా లంకభూముల్లో చిక్కుకుపోయారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు వారిని కాపాడాలంటూ స్థానికులు పోలీసులను కోరారు. అప్రమత్తమైన పోలీసులు, రెవెన్యూ అధికారులు కాపరులను కాపాడడానికి ప్రత్యేక పడవల్లో లంకకు వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *