కేన్‌ విలియమ్సన్‌ను ప్రశంసించిన టీమిండియా కోచ్‌

దిల్లీ: న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ను టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి ట్విటర్‌ వేదికగా ప్రశంసించాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో విజయం త్రుటిలో చేజారినా ఫలితాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి కేన్‌ చూపించిన క్రీడా స్ఫూర్తి ఎంతగానో ఆకట్టుకుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ‘క్లిష్ట పరిస్థితుల్లో నీవు చూపించిన సహనం, హుందాతనం ఎప్పటికీ గొప్పగా నిలిచిపోతాయి. ఫైనల్‌ పోరు ముగిసిన తర్వాత 48 గంటల పాటు నీవు పాటించిన మౌనం ప్రశంసనీయం. ఈ ప్రపంచకప్‌లో నీ పోరాటం గురించి మా అందరికీ తెలుసు. ఎంతో సమర్ధవంతమైన ఆటగాడివి.’ అంటూ రవిశాస్త్రి ట్వీట్‌ చేశాడు. 
ఫైనల్‌ మ్యాచ్‌లో బౌండరీల కారణంగా న్యూజిలాండ్‌ టైటిల్‌ అందుకోలేకపోయింది. అయితే రెండు జట్లూ సమానంగా పోరాడినప్పటికీ ఫలితం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొవడం కష్టమని ఇంతకుముందు విలియమ్సన్‌ అన్నాడు. ఈ మ్యాచ్‌లో ఎవరూ ఓడిపోలేదని, అంతిమంగా మమ్మల్ని ఏదీ విడదీయలేదని ఇంగ్లాండ్‌ జట్టు కప్పు గెలిచిన విజేత.. అంతే తేడా అని కివీస్‌ సారథి పేర్కొన్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *