కేసీఆర్, ఒవైసీ చేతుల్లో తెలంగాణ బందీ: కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ: తెలంగాణ విమోచనదినం నిర్వహించే అంశంలో సీఎం కేసీఆర్.. మజ్లిస్ పార్టీకి భయపడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేసిన కేసీఆర్.. అధికారంలోకి రాగానే మాట మార్చారని అన్నారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. అధికారంలోకి రాగానే కేసీఆర్ మాట మార్చారని దుయ్యబట్టారు. కేసీఆర్ తన భుజాలపై ఒవైసీ బ్రదర్స్‌ను కూర్చొబెట్టుకొని ఊరేగుతున్నారని అన్నారు. మజ్లిస్ చేతుల్లో టీఆర్ఎస్ బందీగా మారిందని, కేసీఆర్, ఒవైసీ చేతుల్లో తెలంగాణ బందీ అయిందని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *