కేసీఆర్ సెంటిమెంట్.. నా వల్లే టీడీపీ లేఖ: మంత్రి గంగుల

కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరీంనగర్ జిల్లా సెంటిమెంట్ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అందుకే జిల్లాకు నాలుగు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. వినోద్‌కి క్యాబినెట్ రాంక్‌తో కలిపి జిల్లాకు మొత్తం ఐదు పదవులు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని అన్నారు. 2009లో తాను టీడీపీ నుంచి గెలిచానని, తెలంగాణ కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షతో తాను టీఆర్ఎస్‌లో చేరానన్నారు. దీంతో తన వల్లే తెలంగాణకు టీడీపీ అనుకూలంగా లేఖ ఇచ్చిందన్నారు. కేసీఆర్‌‌ను దగ్గరి నుంచి చూశానని, ఆయనో డిక్షనరీ అని కమలాకర్ ప్రశంసించారు. 2018లో కేసీఆర్ బొమ్మతోనే గెలిచానని, కేసీఆర్ బొమ్మను చూసే ప్రజలు ఓట్లేశారని, కేసీఆర్ ఏం చెప్తే అదే చేస్తానని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *