ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న గవర్నర్ తమిళి సై

హైదరాబాద్: గవర్నర్ తమిళి సై మంగళవారం ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఉత్సవ నిర్వాహకులు గవర్నర్‌కు శాలువ కప్పి సన్మానించారు. మరోవైపు భక్తులు కూడా వినాయకుడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెండు కిలోమీటర్లమేర క్యూ లైన్ ఉంది. గవర్నర్ రాక సందర్భంగా 30 నిముషాలపాటు క్యూ లైన్ నిలిపివేశారు. మంగళవారం ఉదయం నుంచి సుమారు రెండు లక్షల మంది భక్తులు గణనాథుడిని దర్శించుకున్నారు. కాగా గవర్నర్ రాక సందర్భంగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *