గడ్కరీకి తప్పిన ముప్పు

నాగ్‌పూర్‌: కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. నాగ్‌పూర్‌ నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తింది. అయితే పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించి టేకాఫ్‌ చేయకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

ఇండిగోకు చెందిన 6ఈ 636 విమానం నేడు నాగ్‌పూర్‌ నుంచి దిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే విమానంలో తీవ్రమైన సాంకేతిక లోపం ఉన్నట్లు టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందు పైలట్‌ గుర్తించారు. వెంటనే టేకాఫ్‌ను రద్దు చేసి విమానాన్ని రన్‌వే నుంచి టాక్సీవే వద్దకు తీసుకొచ్చారు. ప్రయాణికులను దింపేసి మరమ్మతులు చేపట్టారు. కాగా, ప్రయాణికుల్లో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కూడా ఉన్నారు. ప్రస్తుతం వారంతా ఎయిర్‌పోర్టులోనే ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఘటనపై ఇండిగో ఇంకా స్పందించలేదు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *