గూగుల్‌ అసిస్టెంట్‌తో తెలుగులో..!

గూగుల్‌ అసిస్టెంట్‌తో ఇంగ్లిషు భాషలోనే మాట్లాడాలా? తెలుగు మాట్లాడితే అర్థం చేసుకోదా? అంటే ఇకముందు తెలుగులో మాట్లాడినా అర్థం చేసుకుంటుంది. తాజాగా గూగుల్‌ సంస్థ కొత్తగా ఏడు భాషలను గూగుల్‌ అసిస్టెంట్‌కు జోడించింది. భారతీయుల కోసం ప్రత్యేకంగా తెలుగు, తమిళం, బెంగాలి, గుజరాతి, కన్నడ, మలయాళం, ఉర్దూ భాషలను గూగుల్‌ అసిస్టెంట్‌కు జత చేసింది. అంటే ఈ ఏడు భాషల్లో ఏ భాషలో మాట్లాడినా గూగుల్‌ అసిస్టెంట్‌ గుర్తిస్తుంది. గత ఏడాది మరాఠి భాషను జోడించిన గూగుల్‌, ఈ ఏడాది ఏకంగా ఏడు భాషలను జత చేసింది. అలాగే జియోఫోన్‌ వినియోగదారుల కోసం ‘వాయిస్‌ టైపింగ్‌’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌ సహాయంతో స్పీచ్‌ నుంచి టెక్ట్స్‌కు సులభంగా తర్జుమా చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *