గోదావరిలో బోటు వెలికితీత ప్రక్రియ ప్రారంభం

ఇటీవల కచ్చులూరు గోదావరిలో బోటు మునిగిపోయిన విషయం తెలిసిందే. గోదావరిలో బోటు వెలికితీత ప్రక్రియ ప్రారంభమైంది.ధర్మాడి సత్యం నేతృత్వంలో 25 మంది సభ్యులతో ఆపరేషన్‌ రాయల్‌ వశిష్ట పేరిట ప్రక్రియను చేపడుతున్నారు. బాలాజీ మెరైన్స్‌ సంస్థ బోటు వెలికితీత ప్రక్రియను ప్రారంభించింది. భారీ ప్రొక్లెయిన్‌, ఐరన్‌, నైలాన్‌ రోప్స్‌తో బోటు వెలికితీత పనులు చేపడుతున్నారు. బోటు ప్రమాద స్థలానికి ఎవ్వరినీ వెళ్లనీయకుండా పోలీసులు మోహరించారు.బోటు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 36 మంది మృతదేహాలను వెలికితీశారు. బోటు వెలికితీస్తే మిగతా 11 మంది మృతదేహాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *