గోవుల మృతిపై సమగ్ర పరిశీలన చేయండి- కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌

విజయవాడ: నగర శివారులోని కొత్తూరుతాడేపల్లిలో 100 గోవులు మృతి చెందిన గోశాలను కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పరిశీలించారు. గోవులు మృతిచెందడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. పరిమితికి మించిన గోవులను ఉంచారని కలెక్టర్‌ అభిప్రాయపడ్డారు. ఆవుల మృతిపై సమగ్ర పరిశీలన చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ పర్యటన సమయంలోనూ నిర్వాహకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఒకరిపైమరొకరు ఆదిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. ఉండాల్సిన సంఖ్య కంటే ఎక్కువ గోవులను గోశాలలో ఉంచారని ఘటనా స్థలాన్ని పరిశీలించిన పశుసంవర్థక శాఖ అధికారులు తెలిపారు. గ్యాస్ ఎక్కువ అవ్వడం వల్ల గోవులు మృతిచెందినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని కలెక్టర్‌కు తెలియజేశారు. 
స్థానికుల ఆందోళన
పెద్దమొత్తంలో ఆవుల మృతి చెందడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోశాల నిర్వహణ వల్ల ఇప్పటికే భూగర్భజలాలు కలుషితమైపోయాయని, ఇప్పుడు గోవుల కళేబరాలను కూడా అక్కడే ఖననం చేయడం వల్ల ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గోశాలను పరిశీలించేందుకు వచ్చిన కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ మిషా సింగ్‌తో వారి ఆవేదనను పంచుకున్నారు. మరణించిన గోవులను వేరే ప్రాంతంలో ఖననం చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *