చిన్నారులతో షారుక్‌డ్యాన్స్‌.. వీడియోలు వైరల్‌

మెల్‌బోర్న్‌: బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌కు స్వదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ ఉంది. మెల్‌బోర్న్‌లో నిర్వహిస్తున్న ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌(iifm) వేడుక గురువారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన షారుక్‌ తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘దిల్‌ సే’ చిత్రంలోని ‘ఛయ్య ఛయ్య’ పాటకు డ్యాన్స్‌ చేసి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు.

షారుక్‌ స్టేజ్‌పై చిన్నారులతో కూడా డ్యాన్స్‌ చేశారు. అనంతరం స్టేజ్‌పై ఉన్న పిల్లలందరినీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముచ్చటించారు. షారుక్‌ డ్యాన్స్‌ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. షారుక్‌ హీరోగా గత ఏడాది వచ్చిన ‘జీరో’ చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. ఈ చిత్రంలో అనుష్క శర్మ, కత్రినాకైఫ్‌ కథానాయికలుగా నటించారు. ‘జీరో’ తర్వాత షారుఖ్‌ తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *