జగన్.. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకో: ఉండవల్లి

నీ ఎంఎల్ఏ లే నీకు ఎసరు పెడతారు

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం ఉండవల్లి విలేఖర్లతో మాట్లాడారు. జగన్ అధికారం శాశ్వతమని భావించకూడదని, చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. గతంలో పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ ఇలాగే భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చినా ఎంతో కాలం నిలవలేకపోయారని ఆయన గుర్తుచేశారు. ప్రజల్లో వ్యతిరేకత లేకున్నా, ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత లేకుండా చూసుకోవాలని సూచించారు . నవరత్నాల్లో ఏ ఒక్కటి సరిగా అమలుకాకపోయినా సొంత వారి నుండే తీవ్ర వ్యతిరేకత వస్తుందని గుర్తించాలన్నారు. అతి ధీమా పనికి రాదని, స్వయంకృషితో వచ్చిన అరుదైన అవకాశాన్ని జారవిడుచుకోకుండా జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం జగన్‌కు ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *