టెస్టుల్లో ఆసీస్.. వన్డేల్లో మనం నెం.1

దుబాయ్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్, టీం ఇండియా వెస్టిండీస్ పర్యటన అనంతరం.. ఐసీసీ తాజాగా వన్డే, టెస్ట్ ర్యాంకులను విడుదల చేసింది. అయితే తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకుల్లో బ్యాటింగ్‌లో స్టీవ్ స్మిత్, బౌలింగ్‌లో ప్యాట్ కమ్మిన్స్ నెం.1 స్థానంలో ఉన్నారు. బ్యాటింగ్‌లో 937 పాయింట్లతో స్మిత్ మొదటి స్థానంలో ఉండగా.. 903 పాయింట్లతో కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు వన్డేల్లో భారత ఆటగాళ్ల ఆధిపత్యం అలాగే కొనసాగుతుంది. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా.. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. అంతేకాక.. రెండో స్థానంలో కూడా భారత బ్యాట్స్‌మెనే ఉండటం విశేషం. 895 పాయింట్లతో కోహ్లీ మొదటి ర్యాంకులో ఉండగా.. 863 పాయింట్లతో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక టీ-20ల్లో బాబర్ ఆజామ్ మొదటి స్థానంలో, గ్లెన్ మ్యాక్స్‌వెల్ రెండో స్థానంలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *