డైరెక్టర్ హిట్టు కొడతాడా?

ఆ మధ్య ‘పెళ్లి చూపులు’ సినిమాతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇప్పుడు  డైరెక్షన్ కి బ్రేక్ ఇచ్చి యాక్టర్ గా మారాడు. గతేడాది ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ ఓ బడ్డీ కామెడీ సినిమాతో వచ్చిన ఈ దర్శకుడు ఆ సినిమాతో ఆశించిన ఫలితం అందుకోలేకపోయాడు. అందుకే ఇప్పుడు నటుడిగా వచ్చిన అవకాశాలు అందుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ‘సమ్మోహనం’ – ‘మహానటి’ – ‘ఫలక్ నుమా దాస్’ వంటి సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసిన ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా మారిపోయాడు. హీరోగా ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమా చేసాడు. విజయ్ దేవరకొండ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో నటుడిగా పూర్తి స్థాయిలో అలరించబోతున్నాడు దర్శకుడు. టీజర్ లో తరుణ్ నటన కి  మంచి మార్కులే పడ్డాయి. సినిమాకి తరుణ్ కామెడీ టైమింగ్ హైలైట్ అనిపిస్తుంది కూడా.

అయితే తరుణ్ భాస్కర్ కి ఈ సినిమా సక్సెస్ అవ్వడం చాలా ముఖ్యం. ఏ మాత్రం అటూ ఇటూ అయినా డైరెక్టర్ గా సినిమాలు చేసుకోవచ్చు కదా ఇవన్నీ అవసరమా అనే కామెంట్ వస్తుంది. అదే హిట్ కొడితే మల్టీ టాలెంటెడ్ అంటూ అభినందిస్తారు. ప్రస్తుతానికి టీజర్ అయితే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. మరి ఈ సినిమాతో ఈ డైరెక్టర్ హీరోగా హిట్టు కొడతాడా.. లేదా చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *