తిరుమలలో అన్నదానానికి ఎన్నారై భారీ విరాళం..

తిరుమల: తిరుమల శ్రీవారికి పరమ భక్తుడైన ఓ ఎన్నారై తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. తిరుమలలో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు ఏకంగా రూ.కోటిన్నూటపదహారు విరాళం అందజేశాడు. ఈ భారీ మొత్తాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రత్యేక అధికారి తిరమల ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఇటీవల తిరుమలను సందర్శించిన ఎమ్ శ్రీనివాసరెడ్డి అనే ఎన్నారై ఈ విరాళాన్ని అందించాడు. తిరుమల గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రంగనాయకుల మండపం వద్ద డిమాండ్ డ్రాఫ్ట్‌ను టీటీడీ సభ్యులకు అందజేశాడు. తిరుమలలో జరిగే నిత్యాన్నదానానికి తన వంతు సాయంగా ఈ సొమ్మును అందజేస్తున్నట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *