తెదేపాను వీడే ప్రసక్తే లేదు: బొండా ఉమ

అమరావతి: తాను తెదేపాను వీడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమైన అనంతరం బొండా మీడియాతో మాట్లాడారు.  సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. తెదేపాలోనే తాను కొనసాగుతానని బొండా స్పష్టం చేశారు. గత కొద్దిరోజులుగా బొండా ఉమా తెదేపాను వీడుతారనే ప్రచారం జరిగింది. పార్టీ మారుతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఇటీవల ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆయనతో చర్చలు జరిపారు. తాజాగా చంద్రబాబుతో బొండా భేటీ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *