తెలంగాణలో జూడాల సమ్మె విరమణ

హైదరాబాద్‌: జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) బిల్లుకు వ్యతిరేకంగా చేస్తోన్న సమ్మెను తెలంగాణ జూనియర్ డాక్టర్లు(జూడా) విరమించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రితో చర్చల అనంతరం సమ్మె విరమిస్తున్నట్లు జూడాలు ప్రకటించారు. కేంద్ర చట్టంపై న్యాయపోరాటం చేస్తామని, దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దిల్లీలోని జంతర్‌మంతర్‌లోనూ నిరసన వ్యక్తం చేస్తామని జూడాలు తెలిపారు. అవసరమైతే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి విధులకు హాజరవుతామని.. సెలవు రోజుల్లోనూ విధులు నిర్వహిస్తామని తెలిపారు. అటు వైద్యుల ప్రయోజనాలకు కొత్త చట్టం ఇబ్బంది కాబోదని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ హామీ ఇచ్చారని మంత్రి ఈటల రాజేందర్ జూడాలతో చెప్పారు. వైద్యులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఆయన వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *