కేసీఆర్‌కు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. సంగారెడ్డి ప్రజలు మంచినీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. సింగూరు ఎండిపోవడంతో సంగారెడ్డిలో నీటి ఎద్దడి నెలకొందని, గోదావరి జలాలు తరలించి ప్రజల దాహార్తిని తీర్చాలని కోరారు. నీళ్లు కావాలని అడిగితే.. జిల్లా తెరాస నేతలు ఎదురు దాడికి పాల్పడుతున్నారని ఆక్షేపించారు. పశువుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంలో సీఎం సానుకూలంగా స్పందించి తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *