తెల్లకార్డుదారులకు ఏపీ సర్కార్ శుభవార్త

సెప్టెంబర్ 1 నుంచి అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రకటించారు. సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు కన్నబాబు, శ్రీరంగనాథరాజు, సీఎం సలహాదారు అజేయ కల్లం, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ… ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా ఇస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయన్నారు. తినడానికి పనికిరాకపోవడంతో రీసైక్లింగ్‌కు పంపుతున్నారని చెప్పారు. కేంద్రం నుంచి వస్తున్న బియ్యం‌లో కూడా 25 శాతం నూకే వస్తుందని తెలిపారు. నాణ్యత లేని బియ్యం సరఫరా వల్ల అన్నం ముద్దగా మారుతోందని వెల్లడించారు. అందుకే రేషన్ షాపుల్లో వినూత్న మార్పులు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. కల్తీ లేని, తినేందుకు అనువైన సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. దీనికి 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయన్నారు. బియ్యం సేకరణకు అవలంభించాల్సిన విధానాలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. సన్న బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వంపై వెయ్యి కోట్లు భారం పడుతుందని అంచనా వేసినట్లు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *