తొలి బీఎస్‌-6 యాక్టివా125 లాంచ్‌

 న్యూఢిల్లీ:  భారతదేశపు రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్‌ స్కూటర్ ఇండియా తన మొట్ట మొదటి బీఎస్‌ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తొలి వాహనాన్ని విడుదల చేసింది.   బీఎస్‌ 6 నిబంధనలకు అనుగుణంగా యాక్టివా వెర్షన్‌ను బుధవారం తీసుకొచ్చింది.  మూడు వేరియంట్లలో తీసుకొచ్చిన ఈ స్కూటర్‌  ప్రారంభ ధరను  రూ .67,490 గా నిర్ణయించింది. ఈ నెల చివరి నాటికి కొత్త స్కూటర్లు రోడ్లపైకి రావడం ప్రారంభిస్తాయని, దశలవారీగా దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు హోండా తెలిపింది. తమ కొత్త యాక్టివా 125 బిఎస్-6 తో, పరిశ్రమలో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో,  తదుపరి విప్లవానికి లీడర్‌గా నిలుస్తుందని   హోండీ సీఎండీ  మినోరు కటో చెప్పారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *