థ్రిల్లర్‌ ప్రేమికులు తప్పకుండా చూడండి: బన్నీ

హైదరాబాద్‌: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు. నవీన్‌ పోలిశెట్టి కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. శృతి శర్మ కథానాయిక. స్వరూప్‌ ఆర్‌.ఎస్‌.జె దర్శకుడు. స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించింది. గత నెల 21న విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. ఈ సినిమాను తాజాగా చూసిన అల్లు అర్జున్‌ చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్వీట్‌ చేశారు.

‘ఇప్పుడే ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా చూశా. వినోదంతో కూడిన మంచి థ్రిల్లర్‌ సినిమా ఇది. తెలుగు చిత్ర పరిశ్రమలోకి నైపుణ్యం ఉన్న కొత్త తరం దర్శకులు, నటులు రావడం చాలా సంతోషంగా ఉంది. మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు. థ్రిల్లర్‌ ప్రేమికులు తప్పకుండా ఈ సినిమా చూడండి’ అని పోస్ట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *