నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.38గంటల సమయంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 209 పాయింట్ల నష్టంతో 37,372 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 54 పాయింట్ల నష్టంతో 11,055 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.09 వద్ద కొనసాగుతోంది. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, గెయిల్‌ ఇండియా, బీపీసీఎల్‌, యస్‌ బ్యాంక్‌, ఇండియాబుల్స్ హౌసింగ్‌, జీ ఎంటర్‌టైన్ మెంట్‌, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా.. ఎన్టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, వేదాంత, ఎమ్‌అండ్ఎమ్‌, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, జేఎస్‌డబ్ల్యూ, హెచ్‌యూఎల్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రంగాలవారీగా చూస్తే.. ఇంధన రంగం మినహా మిగతా రంగాల షేర్లన్నీ నష్టాల్లో పయనిస్తున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *