నాగార్జున సాగర్ 23 గేట్లు ఎత్తివేత

నల్గొండ: శ్రీశైలం నుంచి వస్తున్నవరద ప్రవాహం గంట గంటకు పెరుగుతుండడంతో నాగార్జున సాగర్ డ్యామ్ 23 గేట్లను అధికారులు తెరిచారు. 3లక్షల 77వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 2లక్షల 94వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.70 అడుగుల నీటి మట్టం ఉంది. 312 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న సాగర్‌లో ప్రస్తుతం 310 టీఎంసీల నీటి నిలువ ఉంది. సాగర్ గేట్లు ఎత్తగానే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని అధికారులు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *