నితీషే ఎన్డీయే కెప్టెన్: తేల్చిచెప్పిన బీజేపీ

పాట్నా: బీహార్‌లోని అధికార ఎన్డీయే నాయకత్వంలో మార్పు జరగనున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో బీజేపీ బుధవారంనాడు స్పష్టత ఇచ్చారు. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి నితీష్ కుమారే సారథ్యం వహిస్తారని తెలిపింది. పార్టీ వైఖరిపై ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే ఈమేరకు ఓ ట్వీట్‌ చేశారు. ‘బీహార్‌లో ఎన్డీయేకు కెప్టెన్ నితీష్ కుమారే. 2020లోనూ ఆయనే కెప్టెన్‌గా కొనసాగుతారు. కెప్టెన్ ఫోర్లు, సిక్సర్లు కొడుతూ ఇన్నింగ్ తేడాతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తుంటే ఆయనను మార్చాలనే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది?’ అని సుశీల్ మోదీ ట్వీట్ చేశారు. దీనికి ముందు, నితీష్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని బీజేపీకి ఆ పదవి దక్కేందుకు మార్గం సుగమం చేయాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సంజయ్ పాశ్వాన్ రెండ్రోజుల క్రితం డిమాండ్ చేశారు. పదిహేనేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్‌పై బీజేపీ ఎంతో నమ్మకం ఉంచిందని, ఈసారి నితీష్ అదే నమ్మకం బీజేపీపై ఉంచి నాయకత్వ బాధ్యతలను, సీఎం పదవిని ఒకసారి తమకు ఇవ్వాలని ఆయన కోరారు. సుశీల్ మోదీ పేరును సైతం సంజయ్ పాశ్వాన్ సూచించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ నితీషే కెప్టెన్‌గా ఉండారని సుశీల్ మోదీ స్పష్టత ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *