నేను అలా అనలేదు: రాజయ్య

వరంగల్: తమ అధినేత కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వివరణ ఇచ్చారు. కేసీఆర్ తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చారని, ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేనని అన్నారు. మంత్రివర్గ విస్తరణపై రాజయ్య అసంతృప్తిలో ఉన్నారంటూ పలు కథనాలు ప్రసారమయ్యాయి. ఈ కథనాలపై స్పందించిన రాజయ్య.. తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. మాదిగలకు త్వరలోనే ఉన్నత పదవులు వస్తాయని ఆశిస్తున్నానని విశ్వాసం వ్యక్తం చేశారు. తన హోదాకు తగ్గట్లుగా తగిన పదవి ఇస్తామని కేసీఆర్, కేటీఆర్ భరోసా ఇచ్చారని చెప్పుకొచ్చారు. మాదిగలకు మంద కృష్ణ ఒక్కడే ప్రతినిధి కాదని, తాను అంతకన్నా పెద్దవాడినని రాజయ్య అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *