నోట్లో గుడ్డలు కుక్కి బాలికపై అత్యాచార యత్నం

రాజేంద్రనగర్‌: ఓ బాలికపై అత్యాచార యత్నం చేసిన వ్యక్తిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మైలార్‌దేవిపల్లి ఠాణా పరిధిలో ఓ బస్తీలో నివాసం ఉండే బాల్‌రాజ్‌ తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఇటీవల ఆ బాలిక కుటుంబ సభ్యులు ఇల్లు ఖాళీ చేసి మరో ఇంట్లోకి మారారు. బాల్‌రాజ్‌ సోమవారం సదరు బాలిక(12) నివాసం ఉండే ఇంట్లోకి వెళ్లి బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్లి చూడగా బాలిక నోట్లో వస్త్రం కుక్కి ఉంది. ఇంటి యజమాని ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *