పాక్‌ స్పిన్‌ దిగ్గజం కన్నుమూత

లాహోర్‌:  పాకిస్తాన్ మాజీ క్రికెటర్, లెగ్ స్పిన్ దిగ్గజం అబ్దుల్ ఖాదిర్(63) గుండెపోటుతో కన్నముశారు.  తీవ్రమైన గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.  లాహోర్‌లోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం ఆయన తుది శ్వాస విడిచారు. పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్, ఉమర్ సోదరుడు కమ్రాన్ అక్మల్ ఈ వార్తను ధృవీకరించారు. దీంతో  ఖాదిర్‌ హఠాన‍్మరణంపై పలువురు క్రీడానిపుణులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రపంచ క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన 70-80 కాలంలో, తన బౌలింగ్‌ యాక్షన్‌, మణికట్టు స్పిన్ మ్యాజిక్‌తో అద్భుత విజయాలు అందించిన ఘనత ఖాదిర్‌దేనని క్రికెట్ పండితులు, ఇతరు  అభిమానులు గుర్తు చేసుకున్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *