పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన టీఆర్ఎస్ కీలక నేత

నాగర్ కర్నూలు: తెలంగాణ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టీఆర్ఎస్ పార్టీకి టాటా చెప్పి కాషాయం కండువా కప్పుకుంటారని గత కొన్ని రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ఈ వార్తలపై స్పందించని జూపల్లి తాజాగా మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చారు. మంగళవారం నాడు జిల్లాలోని కొల్లాపూర్ టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాజీ మీడియా సమావేశం నిర్వహించారు. తాను టీఆర్ఎస్‌ను వీడట్లేదని.. పార్టీని వీడాల్సిన అవసరం తనకు లేదని జూపల్లి తేల్చిచెప్పారు. పుకార్లపై జూపల్లి క్లారిటీ.. కోటి రూపాయలు దావా!తనపై ఇలాంటి పుకార్లు వస్తున్నందుకు చాలా బాధపడుతున్నానని.. ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కోటి రూపాయలకు పరువునష్టం దావా వేస్తున్నానని ఈ సందర్భంగా జూపల్లి స్పష్టం చేశారు. పార్టీ మార్పుపై గతంలోనే క్లారిటీ ఇచ్చానని అయినప్పటికీ తనపై వార్తలు మాత్రం ఆపట్లేదని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. నేను ప్రజల పక్షం వహించాను. రాజకీయాల్లో20 సంవత్సరాలు పార్టీ మారలేదు. అధికారం ఉండి పదవి ఉండి వదిలేశాను. నా పని నేను చేస్తూ టీఆర్ఎస్ పార్టీలో పని చేస్తున్నాను. మాకు ఉన్న నైతిక విలువలు ఉన్నాయి. నేను పదవులకు అమ్ముడుపోలేదు. ఉన్న పదవులు వదులుకున్నాను. దయచేసి ఇలాంటి ప్రచారాలు మానుకోండి. ఖర్చు లేకుండా అవాస్తవాలు.. వాస్తవాలని ప్రతిష్టకు భంగం కలిగించాలని సోషల్ మీడియా ద్వారా కొందరు పనిగట్టుకుని మరీ పుకార్లు పుట్టిస్తున్నారు’ అని ఈ సందర్భంగా జూపల్లి చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *