ప్రకాశం బ్యారేజీలో తెరుచుకున్న 70 గేట్లు

విజయవాడ: ఎగువ పులిచింతల నుంచి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను పైకెత్తారు. బ్యారేజీలో ప్రస్తుతం 10 అడుగుల నీటి మట్టం ఉంది. తొలుత  నీటి మట్టం 12 అడుగులకు చేరితే గేట్లు తెరవాలని అధికారులు భావించినప్పటికీ వరద ప్రవాహం అధికంగా ఉండటంతో ముందుగానే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 3.05 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 2.5 టీఎంసీల నిల్వ ఉంది.  ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద కారణంగా పట్టిసీమ నుంచి వస్తున్న నీటిని నిలిపివేశారు. ప్రకాశం బ్యారేజీకి 1998, 2000 సంవత్సరాల్లో భారీ వరద వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *