ప్రధాని మోదీకి ముద్రగడ లేఖ

కాకినాడ: కాపులకు రిజర్వేషన్లపై అంశంపై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2017లో తెదేపా ప్రభుత్వం ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లలో కాపులకు 5శాతం కోటా కేటాయించిందని, దీనిని కేంద్రం ఆమోదించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్లు కల్పిస్తామని హామీలు ఇస్తూ ప్రభుత్వాలు తమ జాతిని మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసమే కాపులను వాడుకుంటున్నారని ప్రధానికి రాసిన లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *