ప్రమాదకర స్థాయిలో గోదావరి

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరికి వరద మరింత పెరిగింది. గోదారి ప్రవాహం అత్యంత ప్రమాదకరంగా సాగుతోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 15.6 అడుగుల నీటిమట్టం ఉంది. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. డెల్టాకాల్వలకు 10,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 15.51 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. భద్రాచలం వద్ద వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. భద్రాచలం వద్ద గోదావరిలో 44.8 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
జలదిగ్బంధంలోనే కోనసీమ గ్రామాలు
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతాలు ఇంకా వాననీటిలోనే నానుతున్నాయి. గత 10 రోజులుగా గోదావరి నదీపాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.దీంతో కోనసీమలోని అప్పనపల్లి, జి.పెదపూడి, ముక్తేశ్వరం గ్రామాల్లోని కాజ్‌వేలపై నీరు ప్రవహిస్తోంది. బూరుగులంక ,అరిగెలవారిపేట, జి.పెదపూడిలంక సహా అనేక లంక గ్రామాలు నీట మునిగాయి. దీంతో అక్కడి ప్రజలు మర పడవలు, నాటుపడవల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. వేలూరుపాడు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలను అధికారులు పునరావాసాలకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *