బిగ్ బాస్ కెప్టెన్ రూల్స్… ఫుల్ కామెడీ

రియాలిటీ షో బిగ్ బాస్ బుల్లితెర మీద మంచి టీఆర్పీ దూసుకెళుతుంది. ఇప్పటికే 47 ఎపిసోడ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ శుక్రవారం నాడు 48 ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ మొత్తం బాబా భాస్కర్ డామినేషన్ సాగింది. తాను హౌసుకు కొత్త కెప్టెన్ కావడంతో పిచ్చి పిచ్చి రూల్స్ అన్ని పెట్టి ఇంటిలో ఫుల్ కామెడీ చేశారు. మొదట ఎపిసోడ్ ప్రారంభంలో శ్రీముఖి సారీ చెబుతూ బాబాని బ్రతిమలాడటం చేసింది. మొన్న టాస్క్ లో తన బిహేవియర్ గురించి మాట్లాడుతూ…అలా చేయకుండా ఉండాల్సిందని బాబాకి దండం పెడుతూ…గడ్డం దువ్వింది. దీంతో బాబా క్షమించేసి…కోపం లేదని చెప్పాడు.


వీరి టాపిక్ ముగిశాక బాబా హౌస్ లో కొత్త కెప్టెన్ గా రచ్చ చేశారు. తన కెప్టెన్సీలో ఎవరికి నచ్చినట్లు వారు ఉండొచ్చని – పడుకోవచ్చని – ఇంగ్లీష్ లో మాట్లాడుకోవచ్చని చెప్పారు. అలాగే అమ్మాయిలు పొట్టి బట్టలు వేసుకొద్దని సూచించారు. అలాగే తనని కెప్టెన్ అని పిలవొద్దని – ఇంటి సభ్యులు తనపై కురిపించిన ప్రేమతోనే తాను కెప్టెన్ ని అయ్యానని – టాస్క్ లో తాను ఏమీ చేయకపోవడం సిగ్గుగా ఉందని అంత ఏజ్ లో కూడా ఎంతో కష్టపడి తనను కెప్టెన్ చేసిన శిల్పాకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని అందరినీ నవ్వించారు.

దీని తర్వాత ఇంటి సభ్యులకు వారంలో చేసే పనుల బాధ్యతలని అప్పగించారు. అయితే శ్రీముఖి తన పర్సనల్ అసిస్టెంట్ గా ఉంటుందని – ఆమె స్విమ్మింగ్ పూల్ – కోర్ట్ యార్డ్ – డైనింగ్ ఏరియాను క్లీన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇక చెప్పడం చెప్పడమే ఆమెతో బయట సోఫాలన్నీ క్లీన్ చేయించారు. కావాలని సరిగా క్లీన్ చేయడం లేదని పట్టి పట్టి చేయించారు.

ఇక అలీ – మహేశ్ కెప్టెన్ అయినందుకు పార్టీ ఇవ్వాలని బాబాని కోరారు. దీంతో బాబా మెయిన్ గేట్ వద్దకు వెళ్లి.. ‘‘హలో వాచ్ మెన్ డ్రింక్ దొరకుతుందా ? హలో బ్రో.. నేను కెప్టెన్ అయ్యాను రెండు కేసుల బీర్ – రెండు ఫుల్ – బాయిల్డ్ పల్లీ తీసుకువస్తే నేను బయటికి వచ్చినప్పుడు నీ సంగతి చూసుకుంటాను’’ అని మస్తు కామెడీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *