బొకేలు వద్దు.. నోట్‌ బుక్కులు ముద్దు: సబిత

హైదరాబాద్‌: తనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చే వారు పూల బొకేలను తీసుకురావొద్దని, వాటి స్థానంలో పెన్నులు, నోట్‌ పుస్తకాలు తీసుకురావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. లేదంటే వారే స్వయంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందించాలని సూచించారు. శుభాకాంక్షల పేరుతో వృథా ఖర్చు చేయకుండా ఆ డబ్బులను సీఎం సహాయనిధికి ఇవ్వాలన్నారు. మరోవైపు.. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. యూటీఎఫ్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాములు, చావ రవి, పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్ష ప్రధానకార్యదర్శులు అంజిరెడ్డి, చెన్నయ్య, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి తదితరులు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *