భారత్‌, శ్రీలంకపై తీవ్రవాద దాడులు జరిగే అవకాశం

ఐసిస్‌ సిరియా, ఇరాక్‌లలో పట్టుకోల్పోయిన నేపథ్యంలో వారు ఈ రెండు దేశాలపై దృష్టి కేంద్రీకరించారని ఆ నివేదిక పేర్కొన్నది. రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం కేరళ ఉన్నతస్థాయి పోలీసు అధికారులకు మూడు లేఖలను పంపిందని, తీవ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని ఆ లేఖల్లో పేర్కొన్నదని ఒక వార్తా సంస్థ తెలిపింది. ఇందులో ఒక లేఖను ఎన్డీటీవీ సంపాదించింది. ”ఇరాక్‌, సిరియాల్లో తీవ్రంగా పట్టుకోల్పోయిన తరువాత జిహాది రూపంలో హింసను రేపాలని తన శ్రేణులకు ఐఎస్‌ పిలుపునిచ్చింది. హింసను రేపిన తరువాత తమ సంబంధిత దేశాలకు తిరిగి వచ్చేయాలి” అని ఆ లేఖలో సూచించింది. దేశంలో ఐసిస్‌్‌ ప్రభావాన్ని చూపించేందుకు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కాశ్మీర్‌ అత్యంత అవకాశం కలిగిన రాష్ట్రాలుగా సీనియర్‌ అధికారి తెలిపారు. గడిచిన కొద్ది సంవత్సరాలలో కేరళ నుంచి దాదాపు వంద మంది ఐసిస్‌్‌లో చేరారని పోలీసులు తెలిపారు. అంతర్గత భద్రతా సెల్‌లను పటిష్టపరచమనీ జిల్లా పోలీసు చీప్‌లను అధికారులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *