భారత విపణిలో తగ్గనున్న ఐఫోన్‌ ధరలు..!

దిల్లీ: ఐఫోన్‌.. దీనికుండే క్రేజే వేరబ్బా. కానీ ధరమో ఆకాశంలో ఉంటుంది. అందుకే చాలా మంది ఐఫోన్లు కొనేందుకు కాస్త ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి శుభవార్త. త్వరలో భారత విపణిలో ఐఫోన్‌ ధరలు తగ్గనున్నాయట. మేడ్‌ ఇన్‌ ఇండియానే ఇందుకు కారణం. అసలు విషయం ఏంటంటే.. 

యాపిల్‌ సంస్థ టాప్‌ ఎండ్‌ ఐఫోన్లను భారత్‌లో అసెంబిల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఫాక్స్‌కాన్‌కు చెందిన భారత యూనిట్‌ వీటిని రూపొందిస్తోంది. వచ్చే నెలలో ఈ ఫోన్లు విపణిలోకి రానున్నాయట. కొన్ని అనుమతులు పూర్తి చేసుకుని ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌ ఫోన్లు ఆగస్టు నాటికి మార్కెట్లోకి రానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సాధారణంగా పూర్తిగా తయారుచేసిన ఐఫోన్‌పై దిగుమతి సుంకాలు భారీగా ఉన్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో ఐఫోన్లు అత్యధిక ధర పలుకుతున్నాయి. దీనివల్ల అమ్మకాలు తగ్గుతుండటంతో యాపిల్‌ మేడి ఇన్‌ ఇండియాపై దృష్టిపెట్టింది. దీంతో పాటు భారత్‌లో సొంత రిటైల్‌ స్టోర్లను కూడా ప్రారంభించాలని చూస్తోంది.

ఇప్పటికే ఐఫోన్ ఎస్‌ఈ, ఐఫోన్‌ 6ఎస్‌, ఐఫోన్‌ 7ను బెంగళూరులోని తయారీ కేంద్రంలో అసెంబిల్‌ చేస్తోంది. టాప్ ఎండ్‌ ఫోన్లను కూడా త్వరలో తీసుకురానుంది. దీంతో దేశీయ మార్కెట్లో ఐఫోన్‌ ధరలు తగ్గనున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *