మంత్రి పదవి దక్కలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే…!

హైదరాబాద్: తెలంగాణలో కేబినెట్ విస్తరణలో అవకాశం ఉంటుందని ఆశించిన నేతలు.. మంత్రి పదవి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు మీడియా ముందుకు వచ్చి బాహాటంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. అంతేకాదు సీనియర్ నేత జోగురామన్న లాంటి వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు!. ఈ క్రమంలో మరో అసంతృప్త ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహానికి.. అసంతృప్తికి లోనయ్యారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. అయితే మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన.. తన గన్‌మెన్‌లను సరెండర్‌ చేశారు. తన సామాజికవర్గంలో తానే ప్రముఖుడిని అయినా జూనియర్‌కు అవకాశం ఇచ్చారని సన్నిహితుల వద్ద గాంధీ తన అసంతృప్తిని వెల్లగక్కారని సమాచారం. అయితే ఈ అసంతృప్త ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ అధిష్టానం ఎలా శాంతపరుస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *