మందులిచ్చి ప్రాణాలు తీశారు..ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

ఎమ్మిగనూరు పట్టణం: వైద్యుడు రాసిచ్చిన మందులు వాడడంతోనే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన కదిరికోట నరసన్న, రామేశ్వరమ్మల కుమార్తె మౌనిక(17) ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తనకు జుట్టు రాలిపోతూ పలుచగా ఉండడంతో ఏప్రిల్‌లో చర్మ వైద్యుడిని ఆశ్రయించారు. ఆయన పరిశీలించి జుట్టు రాలిపోకుండా ఉండేందుకు ప్రిస్క్రిప్షన్‌లో మందులు రాసిచ్చారు. స్థానిక మందుల దుకాణంలో వాటిని కొనుగోలు చేసి మౌనిక వాడారు. వెంటనే శరీరంపై బొబ్బలు వచ్చి ముఖం ఉబ్బింది. అనంతరం పలువురు వైద్యుల వద్ద చికిత్స చేయించుకున్నారు. అయినా కోలుకోలేక మౌనిక ఆదివారం మృతి చెందారు. దీంతో ఎమ్మిగనూరులోని ఆస్పత్రి, మందుల దుకాణం వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. ‘ట్రీట్‌మెంట్‌ వివరాలు ఇవ్వాలని అడిగినా ఇవ్వలేదు.. దుకాణంలో మందులు వాడడంతోనే తమ కుమార్తె చనిపోయింది’ అంటూ కుటుంబసభ్యులు, బంధువులు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఆవేశంతో మందుల దుకాణానికి తాళం వేసి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *