మరో మైల్‌స్టోన్‌ దాటిన ‘సాహో’

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా యువ దర్శకుడు సుజిత్‌ తెరకెక్కించిన భారీ యాక్షన్‌ అడ్వంచరస్‌ థ్రిల్లర్‌ సాహో. ఆగస్టు 30 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సరికొత్త రికార్డ్‌లను సృష్టిస్తోంది. తొలి రోజే 100 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించిన సాహో పది రోజుల్లో 400 కోట్ల మార్క్‌ను అందుకుంది.

ఇ‍ప్పటికీ సాహో కలెక్షన్లు స్టడీగా ఉండటంతో ముందు ముందుకు మరిన్ని రికార్డ్‌లు సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్‌. చిత్రయూనిట్ కూడా సినిమాను వార్తల్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా సాహో మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. అంతేకాదు ప్రభాస్‌ అభిమానులతో కలిసి సాహో సినిమా చూడటం టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీగా మారింది.

ప్రభాస్‌ సరసన బాలీవుడ్ బ్యూటీశ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. హాలీవుడ్‌ స్థాయి యాక్షన్‌ సీక్వెన్స్‌లతో తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *