మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లా ప్రజలను వణికిస్తున్న వరుస భూకంపాలు

ముంబయి: మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లా ప్రజలను వరుస భూకంపాలు వణికించాయి. బుధవారం అర్ధరాత్రి సమయంలో కేవలం 12 నిమిషాల వ్యవధిలో నాలుగు సార్లు భూమి కంపించింది. తొలుత అర్ధరాత్రి 1.03 గంటలకు భూకంపం సంభవించింది. భూకంపలేఖినిపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. ఆ తర్వాత 1.15 గంటల వరకు 3.6, 2.9, 2.8 తీవ్రతతో మూడు సార్లు భూమి కంపించింది.

జిల్లాలోని దహను కేంద్రంగా ఈ భూకంపాలు సంభవించాయి. వెనువెంటనే భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మరోవైపు పాల్ఘర్‌లో నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. కాగా, భూకంప తీవ్రతకు దహను ప్రాంతంలో ఓ ఇంటి గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఓ 55ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *